Kaizer News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్:మార్చి నాటికి లక్ష ఉద్యో

నిరుద్యోగులకు గుడ్ న్యూస్:మార్చి నాటికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తం..నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి

· State - Telangana · v6velugu.com

మహబూబాబాద్, వెలుగు : వచ్చే మార్చి వరకు రాష్ట్రంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహాదారుడు వేం నరేందర్​రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ లో జిల్లా పోలీస్​శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న ఉచిత ట్రైనింగ్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓకేసారి 560 గ్రూప్ 1 పోస్ట్ లను భర్తీ చేసినట్లు చెప్పారు. కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇక నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నట్లు తెలిపారు. మానుకోట జిల్లాకు త్వరలో స్కిల్స్ యూనివర్సిటీ వస్తుందన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్​ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్, మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి, కలెక్టర్​స్నేహ శబరీశ్, ఎస్పీ శబరీష్, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News