మేషం.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఏ వ్యవహారమైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల ద్వారా అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. పసుపు, లేత ఎరుపు రంగులు. శివాష్టకం పఠించండి. వృషభం... కొన్ని పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఒక ఆసక్తికర సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖుల సలహాలు పొందుతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు కొంత పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. మిధున రాశి ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా కొనసాగుతాయి. ఆప్తులతో నెలకొన్న వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అయితే ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహా యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆసక్తికర మార్పులు జరుగుతాయి. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం... కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలం కాగలవు. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవర్గాల కృషి కొంత ఫలిస్తుంది. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఒప్పందాలు వాయిదా. గులాబీ, నేరేడు రంగులు. గణేశ్ స్తోత్రాలు పఠించండి. సింహం.... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కుటుంబసమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వ్యూహాత్మకంగా శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అ