Kaizer News

Nalgonda: క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల

Nalgonda: క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

· State - Telangana · hmtvlive.com

నల్గొండ: క్షయ వ్యాధిగ్రస్తులకు మందులతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో రిచ్ ఎన్ఎస్ఐఎల్ సంస్థ ఆధ్వర్యంలో 750 మంది బాధితులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులతో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.17 లక్షల ఫర్నిచర్ ఇవ్వడం అభినందనీయమన్నారు. దేవరకొండ, సాగర్ వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందురావాలని కోరారు. సమావేశంలో మేయర్ చైతన్య, డిఎమ్‌హెచ్‌ఓ రాహుల్ పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News