Kaizer News

Breaking News | కారు డోర్‌ లాక్‌ కావడంతో…

Breaking News | కారు డోర్‌ లాక్‌ కావడంతో…

· State - Telangana · prabhanews.com

కారు డోర్‌ లాక్‌ కావడంతో… Breaking News | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబా నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారులో చిక్కుకున్న నాలుగేళ్ల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. స్థానిక సర్పంచ్‌ గంగావత్‌ నవీన్‌కు ఇద్దరు పిల్లలు ఉండగా.. పెద్ద కుమార్తె తన్విశ్రీ (4) ఇంటి వద్ద ఆడుకుంటూ కారు ఎక్కింది. ఈ క్రమంలో కారు డోర్‌ లాక్‌ కావడంతో చిన్నారి అందులోనే చిక్కుకుపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. దాదాపు రెండు గంటల తర్వాత కారులో చూడగా.. ముందు భాగంలోని రెండు సీట్ల మధ్యలో చిన్నారి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News