Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపల్,14వ వార్డు అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణానికి సిమెంటు అందజేసిన ఉప్పల వెంకటేష్. ఈరోజు కల్వకుర్తి మున్సిపాలిటీ 14వ వార్డు, గాంధీ నగర్ రెండు కుటుంబాలకు నరసింహ చారి, శ్రీనివాస్ చారి ఇంటి నిర్మాణం సిమెంట్ చేసుకోలేక మధ్యలో నిలిచిపోయిన విషయాన్ని 14వ వార్డు కౌన్సిలర్ బావాండ్ల మంజుల మధు,కల్వకుర్తి BRS పార్టీ పట్టణ అధ్యక్షులు మధు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఇద్దరి ఇండ్లకు సిమెంట్ ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్,గాంధీ నగర్ కాలనీ బ్రాహ్మ చారి,శేఖర్,చోటు,కృష్ణ తదితరులు పాల్గొన్నారు