Kaizer News

Anakapalli: గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించిన డ

Anakapalli: గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించిన డీసీఎంఎస్ చైర్మన్!

· State - Telangana · hmtvlive.com

Shorts Anakapalli: అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సముచితం కాదని ఆయన అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగజారడం సరికాదని బాలాజీ పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ సీఎం రమేష్ కృషి చేస్తున్నారని, అలాంటి నాయకుడిపై అనవసర ఆరోపణలు చేయడం తగదన్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా, రాజకీయ లబ్ధి కోసం ఎంపీపై ఆధారాలు లేని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని బాలాజీ మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం విమర్శలకే పరిమితం కావడం సరికాదన్నారు. అనకాపల్లి జిల్లాలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని బాలాజీ తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమర్నాథ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోట్ని బాలాజీ డిమాండ్ చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News