బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన రైతు కుసుంబు మోహన్‌రావుకు చెందిన గేదెకు శనివారం రెండు తలల దూడ జన్మించింది. ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించడంతో దూడను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలాంటి దూడలు జన్మించే అవకాశం ఉంటుందని వెటర్నరీ వైద్య నిపుణులు తెలిపారు. రెండు తలలతో దూడ జన్మించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది