Kaizer News

కరీంనగర్ జిల్లా లో ఆటోను ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు ప

కరీంనగర్ జిల్లా లో ఆటోను ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు ప్రాణాలు వదిలారు.. మరో తొమ్మిది మందికి గాయాలు

· State - Telangana · v6velugu.com

గంగాధర, వెలుగు : ట్రాలీ ఆటోను వ్యాన్ ఢీకొట్టడంతో ఒక మహిళ చనిపోగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కరీంనగర్​జిల్లా గంగాధర మండలం మధురానగర్​లో ఆదివారం ఉదయం జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గంగాధర మండలం మల్లాపూర్​గ్రామానికి చెందిన చెల్లోజు వెంకటాచారి తన ట్రాలీ ఆటోలో మంగపేట నుంచి 10 మంది మహిళా కూలీలు లింగాల దేవమ్మ (59), చొప్పదండి శైలజ, నాగెల్లి లక్ష్మి, రాధ, మాధవి, పుల్లెల లక్ష్మి, బైరి నర్సమ్మ, గడ్డమీది స్వరూప, అతికం మమత, బొడ్ల లక్ష్మిని ఎక్కించుకుని పత్తిలో కలుపు తీసేందుకు తీసుకెళ్తున్నాడు. మధురానగర్​చౌరస్తా సమీపంలోకి రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్​వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్​ట్రాలీ ఆటోను ఓవర్​టేక్​ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాలీ ఆటో బోల్తాపడి పది మంది కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని కరీంనగర్​లోని ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ లింగాల దేవమ్మ చనిపోగా, చొప్పదండి శైలజ పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ఎనిమిది మంది స్వల్పగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతురాలు దేవమ్మ భర్త దుర్గయ్య ఫిర్యాదుతో కోళ్ల వ్యాన్​ డ్రైవర్​పవన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్​ప్రమాద స్థలానికి వెళ్లి బాధితులను కరీంనగర్​ హాస్పిటల్​కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News