Kaizer News

Kukkunoor: అంగన్‌వాడీల పెన్షన్ దరఖాస్తులు పునఃపరిశ

Kukkunoor: అంగన్‌వాడీల పెన్షన్ దరఖాస్తులు పునఃపరిశీలించాలి: సీఐటీయూ

· State - Telangana · hmtvlive.com

Shorts కుక్కునూరు: అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పెన్షన్ దరఖాస్తులను ‘నాట్ ఎలిజిబుల్’ పేరుతో తిరస్కరించడం సరికాదని సీఐటీయూ ఏలూరు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కుక్కునూరు డిప్యూటీ ఎంపీడీవో షరీఫ్‌కు సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీలకు కనీస వేతన స్కేలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ ప్రయోజనాలు కల్పించకుండా పెన్షన్ విషయంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం సరికాదన్నారు. తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించి, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే మొదటి దశలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు రెండో దశలో అవకాశం కల్పించాలని, పత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దార కృష్ణ, కోట రాజు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News