Kaizer News

Harish Rao | ప్ర‌భుత్వ భూముల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల

Harish Rao | ప్ర‌భుత్వ భూముల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల‌కు ధారాద‌త్తం చేయ‌డం ఆపాలి.. సీఎంకు హ‌రీశ్‌రావు లేఖ‌

· State - Telangana · ntnews.com

Harish Rao : ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడం ఆపాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియ‌ర్‌ నేత హరీశ్‌రావు లేఖ రాశారు. హైదరాబాద్‌లోని ఆజామాబాద్‌లో రూ.500 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు కేవలం రూ.87 కోట్లకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. రూ.87 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రైవేట్‌ వ్యక్తులకే ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రేవంత్‌ సర్కారు రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీగా మారిపోయిందని విమర్శించారు

Original source: ntnews.com
Read more on Kaizer News