Kaizer News

ఇంటికి వెలుగు ఆడబిడ్డ : జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు

ఇంటికి వెలుగు ఆడబిడ్డ : జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

· National - India · v6velugu.com

నెల్లికుదురు (ఇనుగుర్తి), వెలుగు : ప్రతి ఇంటికి వెలుగు ఆడబిడ్డని, వారికి విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలకు గెయిల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ వారి సీఎస్ఆర్ నిధులతో అందజేస్తున్న సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి స్కూల్​కు వచ్చే ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే సైకిళ్ల పంపిణీ చేసినట్లు చెప్పారు

Original source: v6velugu.com
Read more on Kaizer News