Kaizer News

Bodhan: బోధన్‌లో వినాయక నిమజ్జన రూట్ మ్యాప్‌ను పరి

Bodhan: బోధన్‌లో వినాయక నిమజ్జన రూట్ మ్యాప్‌ను పరిశీలించిన ఆర్డీవో!

· State - Telangana · hmtvlive.com

Shorts బోధన్: బోధన్ పట్టణంలోని సర్వజిని గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ ను బోధన్ ఆ ర్థివో విజయకుమారి పరిశీలించారు. రూట్ మ్యాప్ ను పరిశీలించి నిమజ్జన స్థలాన్ని సందర్శించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆర్డిఓ ఆదేశించారు. శోబయాత్ర సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జన ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను సూచించారు. ఆర్డిఓ వెంట బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి, పట్టణ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ వివిధ శాఖాల అధికారులు ఉన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News