Kaizer News

Hanamkonda: పరకాల ఆకులవాడలో ఘనంగా 6వ రోజు గణపతి పూ

Hanamkonda: పరకాల ఆకులవాడలో ఘనంగా 6వ రోజు గణపతి పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts హనుమకొండ జిల్లా: పరకాల పట్టణంలోని ఆకుల వాడలో మున్నూరు కాపు ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడుకి 6వ రోజు పూజలను ఘనంగా అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా శనివారం గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆకుల పూజ శ్రీ, వెంకటేశ్వర్లు, ఆకుల రాణి, కృష్ణ దంపతులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకునికి అర్చనలు చేసి భక్తులకు స్వామి ఆశీస్సులు అందించారు. గత 6 రోజులుగా ఆకుల వాడలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణనాథుని దర్శించుకుంటున్నారు. మండపం వద్ద భక్తి శ్రద్ధలతో కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆకుల వాడ, మున్నూరు కాపు, భక్తులు కుటుంబ, సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News