Kaizer News

SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీ

SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే

· State - Telangana · ntnews.com

SP Mahesh B Githe | సిరిసిల్ల టౌన్ , ఆగస్టు 31 : శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల (సెప్టెంబర్ 1 నుండి 30వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగించరాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు

Original source: ntnews.com
Read more on Kaizer News