Shorts హన్మకొండ / పరకాల: నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హన్మకొండ భవానీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరగా, ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. వరికోల్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు