Shorts Jangaon: 23, బుధవారం జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు జరుగనున్నాయని, విశ్వహిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. శాంతియుత వాతావరణంలో దిగ్విజయంగా ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కార్యవర్గం పట్టణ విగ్రహాలు నిమజ్జనం కానున్న నెల్లుట్ల చెరువుని సందర్శించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎనగందుల బిక్షపతి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుంటూ చెరువులో కలుషితాలు కలపకుండా కేవలం విగ్రహాలు మాత్రమే నిమజ్జన చేయాలని కోరారు. ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు, వివాదాలు జరుగకుండా సమర్థవంతమైన బంధోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ వారిని కోరారు. నిరంతర ప్రణాళిక పర్యవేక్షణతో నిమజ్జనాలు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఐదవ రోజు నుండి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయని త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. లైటింగ్, త్రాగునీరు, గజ ఈతగాల్లు, అత్యవసర వైద్య సదుపాయాలు ఇతరత్రా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పరిశీలనలో జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు జక్కా ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు