Kaizer News

రైతు భరోసా గోవిందా..

రైతు భరోసా గోవిందా..

· State - Telangana · ntnews.com

వెయ్యి రోజులైనా మారని కాంగ్రెస్‌ సర్కార్‌ పాలన తీరు ముక్రా(కే)లో గుంజీలు తీసి రైతుల వినూత్న నిరసన ఇచ్చోడ, ఆగస్టు 30: కాంగ్రెస్‌ ప్రభు త్వం 1000 రోజులుగా రైతులను మోసం చేస్తున్నదని ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు ఆరోపించారు. ‘రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు గోవిందా..’ అంటూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ప్లకార్డులు పట్టుకొని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని పొలాల్లో ఒంటి కాళ్లపై నిలబడి గుంజీలు తీసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 1000 రోజులవుతున్నా.. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మీనాక్షి, రైతులు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News