Kaizer News

కోన సముందర్ లో ‘చేయూత’ పెన్షన్ల వెరిఫికేషన్

కోన సముందర్ లో ‘చేయూత’ పెన్షన్ల వెరిఫికేషన్

· State - Telangana · prabhanews.com

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండల పరిధిలోని కోన సముందర్‌ గ్రామంలో ‘చేయూత’ పెన్షన్ల అర్హత వెరిఫికేషన్‌ ప్రక్రియను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేయూత పెన్షన్‌ వెరిఫికేషన్‌ ప్రత్యేక అధికారి అరుణకుమారి గ్రామంలోని లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపడుతోందన్నారు. గ్రామంలోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, చేతివృత్తుల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు అధికారులను కోరారు. అర్హత కలిగిన వారికి న్యాయం జరిగేలా వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News