హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినోపై రాజకీయాలు చేయడం ఆపాలని విపక్షాలకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్రంపై ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని.. దీని ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. ‘వర్షాలు లేకపోవడం వల్ల సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతుల బాధలు మేము అర్థం చేసుకోగలం.. కానీ తాగునీటికే మా తొలి ప్రాధాన్యం’ అని మంత్రి ప్రకటించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయని, వచ్చే వేసవికాలం వరకు నీళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరద ప్రవాహాలను బట్టి సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎల్ నినోపై సభలో చేపట్టిన సల్పకాలిక చర్చను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో కారణంగా ఈసారి కరువు తప్పదని శాస్త్రవేత్తలు ముందుగానే తెలిపారని, అందువల్లే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెప్పామని గుర్తుచేశారు. ఎల్ నినో కారణంగా వర్షాలు పడక రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా బేసిన్లలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి 585 టీఎంసీలకు కేవలం 241 టీఎంసీల నీళ్లే ఉన్నాయని అసెంబ్లీలో వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి కృష్ణా బేసిన్‌లో 361 టీఎంసీలకు గాను 333 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి కేవలం 120 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్లు తెలిపారు. గోదావరి బేసిన్‌లో మొత్తం 284 టీఎంసీలకుగాను గతేడాది 164 టీఎంసీల నీళ్లు ఉంటే ఈ ఏడాది కేవలం 121 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు. ‘గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 153.56 టీఎంసీలు ఉండగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కేవలం 61 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జున సాగర్‌లో గతేడాది 174 టీఎంసీలు ఉంటే.. ఇప్పుడు 44 టీఎంసీలే ఉన్నాయి. శ్రీరామ్ సాగర్‌లో గతేడాది 65 టీఎంసీలు ఉంటే ఇప్పుడు కేవలం 31 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎస్సారెస్పీలో 49 శాతం నీళ్లు తక్కువగా ఉన్నాయి. గతేడాది ఈ సమయానికి కృష్ణా గోదావరి బేసిన్‌లో 500 టీఎంసీల నీరుంటే, ఇప్పుడు 241 టీఎంసీల నీరే ఉంది.. గత ఏడాదికన్నా సగానికి సగం నీరు తగ్గిపోయింది’ అని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 44 వేల 34 చెరువులు ఉండగా 40 శాతం చెరువులు సగం కూడా నిండలేదన్నారు.18 శాతం చెరువులు మాత్రమే 70 నుంచి 100 శాతం నిండినట్లుగా మంత్రి తెలిపారు. ఈ నీళ్లను వచ్చే వేసవికాలం వరకు తాగునీటి అవసరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు. తెలంగాణ భూములను బీళ్లుగా మారుస్తూ ఆంధ్రా వాళ్లకు నీళ్లను పంపిస్తున్నామంటూ బీఆర్ఎస్ నాయ కులు చేస్తున్నది తప్పుడు ప్రచారం అని మంత్రి ఉత్తమ్చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 17 వర కు గడిచిన 4 నెలల్లో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ 52 టీఎంసీల నీళ్లు తీసుకుంటే తెలంగాణ 84 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో ఏపీ 17.2 టీఎంసీలు తీసుకుంటే తెలంగాణ 23.61 టీఎంసీల నీటిని