Kaizer News

420 మోసాలపై.. బీఆర్‌ఎస్‌ పోరుబాట

420 మోసాలపై.. బీఆర్‌ఎస్‌ పోరుబాట

· State - Telangana · ntnews.com

వెయ్యి రోజులవుతున్నా హామీల ఎగవేతపై నిలదీసేందుకు సన్నద్ధం సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నాలుగు రోజుల ముందు నుంచే శ్రేణులతో సన్నాహక సమావేశాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ విఫల పాలనపై ప్రజలకు సవివరంగా వివరించాలని బీఆర్‌ఎస్‌ నేతల దిశానిర్దేశం వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులవుతున్నా చేయకపోవడంపై నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం హైదరాబాద్‌, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలుచేస్తామని చెప్పి వెయ్యి రోజులవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం శనివారం పలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, అన్ని వర్గాలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. ప్రతి ఇంటికీ బాకీ కార్డుల పంపిణీ, నియోజకవర్గాల్లో ధర్నాలు, రైతు సదస్సులు, విద్యార్థుల ర్యాలీలతో కాంగ్రెస్‌ మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పలు నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో పార్టీ నేతలు హాజరై శ్రేణులతో మాట్లాడారు. జనగామ జిల్లాలోని పలు మండలాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాజీ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో నిరంతర విద్యుత్తు, పుషలంగా సాగునీరు పొందిన తెలంగాణ నేడు కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ చీకట్లోకి జారుకున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఒక ప్రాజెక్టు కానీ, మౌలిక వసతుల కల్పన కానీ జరుగలేదని, కేవలం పాత పథకాలకు పేర్లు మారుస్తూ కాలయాపన చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఫల్యాలపై విడుదల చేసే చార్జ్‌షీట్‌ ద్వారా ప్రజలకు నిజాలు వివరిస్తామని చిట్‌చాట్‌లో తెలిపారు. రూ.12వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బాకీలు చెల్లించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల, విద్యాసంస్థల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నదని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపల్లిలో జరిగిన సమావేశంలో సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్‌ 5న విద్యార్థులు, యువతతో కలిసి చేపట్టే భారీ ర్యాలీల్లో కాంగ్రెస్‌ వైఖరిని ఎండగడుతామని స్పష్టంచేశారు. గౌడ, యాదవ, ముదిరాజ్‌, ఇతర చేతివృత్తుల సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా పకనబెట్టిందని శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో అందిన సంక్షేమ ఫలాలు నేడు బంద్

Original source: ntnews.com
Read more on Kaizer News