Kaizer News

Nellore: కూటమి ప్రభుత్వ అభివృద్ధి బాటలో ముందుకు గు

Nellore: కూటమి ప్రభుత్వ అభివృద్ధి బాటలో ముందుకు గునుకుల కిషోర్

· State - Telangana · hmtvlive.com

Shorts నెల్లూరు: ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో మర్చిపోయిన అభివృద్ధిని తిరిగి సాధించే దిశగా జవాబుదారీతనంతో ప్రజారంజక పాలనకు బాటలు వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి విజన్‌తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, నెల్లూరు నగరంలో మంత్రి, ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత పట్టాల కల్పన వంటి కార్యక్రమాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. “ప్రజల కోసం చేసిన సేవే నాయకత్వానికి నిజమైన గుర్తింపు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరినప్పుడే ప్రజా పాలనకు సార్థకత.” అని గునుకుల కిషోర్ అన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సేవా కార్యక్రమాల్లో గునుకుల కిషోర్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని, అదే విధంగా 16, (21)డివిజన్ లో విజయలక్ష్మి గునుకుల ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నారని తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అభివృద్ధిలో భాగస్వాములుగా చేసి ప్రజాసేవకు మరింత బలం చేకూర్చాలని స్థానిక ప్రజలను వారు కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News