Kaizer News

గాఢ ప్రేమ.. గాడి తప్పితే

గాఢ ప్రేమ.. గాడి తప్పితే

· Health · ntnews.com

కార్తిక్‌, ప్రియ భార్యాభర్తలు. ఇంట్లో ఉదయం లేవగానే.. ప్రియ సంతోషంగా ఉంటే, కార్తిక్‌ ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటాడు. ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రియ చిరాకుగా ఉంటే.. కార్తిక్‌ కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. తప్పు తనది కాకపోయినా.. ‘నా వల్లే తన మూడ్‌ ఆఫ్‌ అయిందా?’ అని భయపడుతూ ఉంటాడు. ఆమెను కాకా పట్టడానికి రోజంతా ప్రయత్నిస్తూ.. తన ఆఫీస్‌ పనిపై దృష్టి పెట్టలేకపోతాడు. రమ్యకి పెయింటింగ్‌ అంటే ప్రాణం. ఆ రంగంలో ఉన్నతంగా ఎదగాలనే ఆశయం ఆమెది. కానీ, ఆమె భర్తకు మాత్రం.. రమ్య ఉద్యోగం చేయడం, బయటికి వెళ్లడం అస్సలు నచ్చదు. అతన్ని సంతోష పెట్టడమే ధ్యేయంగా.. రమ్య తన ఆశయాలను పక్కన పెట్టేసింది. చివరికి తన స్నేహితులతో మాట్లాడటం కూడా మానేసింది. అతనికి నచ్చినట్లు ఉండటానికి.. తన ఉనికిని తానే పూర్తిగా తుడిచేసుకుంది. ఈ రెండు సందర్భాలను చూడండి. కార్తిక్‌ సంతోషమంతా ప్రియ మూడ్‌పైనే ఆధారపడి ఉంది. ఇటు భర్త సంతోషం కోసం రమ్య తన ఇష్టాలు, స్నేహితులను పక్కన పెట్టేసింది. దీన్నే సైకాలజీలో ‘కో-డిపెండెన్సీ’ అంటారు. ఆరోగ్యకరమైన బంధంలో ఇద్దరు వ్యక్తులు తమ స్వతంత్ర ఆలోచనలు, వ్యక్తిత్వంతో ఉంటూనే ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటారు. కానీ, ఈ కో-డిపెండెంట్‌ బంధంలో ఒకరి ఉనికిని మరొకరు నొక్కివేస్తుంటారు. భయం, ఆందోళన ప్రాతిపదికన బంధాన్ని నడుపుతారు. కో-డిపెండెన్సీ సంబంధాలలో ఒక వ్యక్తి తన సొంత భావోద్వేగాలు, అవసరాలు, జీవితాన్ని కూడా పక్కన పెట్టి పూర్తిగా భాగస్వామి అవసరాలు, సమస్యలు, వారి భావోద్వేగాల చుట్టూనే తన జీవితాన్ని నిర్మించుకుంటారు. ఇది గాఢమైన ప్రేమ లేదా త్యాగంలా అనిపించినప్పటికీ, అంతర్గతంగా వ్యక్తిగత గుర్తింపును కోల్పోవడానికి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. బంధంలో ఆధారపడే వ్యక్తి తన స్వీయ గౌరవం, గుర్తింపు కోసం భాగస్వామి ఆమోదం పైనే ఆధారపడతారు. ఎదుటివారిని రక్షించడం లేదా బాగుచేయడమే తన బాధ్యతగా భావిస్తారు. కో-డిపెండెన్సీ ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం క్రమబద్ధమైన, సున్నితమైన ప్రక్రియ. వీరిలో ఎక్కువగా నేరభావన, తిరస్కరణ భయంతోపాటు తక్కువ స్వీయ-గౌరవం ఉంటాయి. ఇలాంటి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించేలా థెరపిస్ట్‌ కౌన్సెలింగ్‌ ప్రణాళికను రూపొందించాలి. కోపింగ్‌ ప్యాటర్న్స్‌ గుర్తించడం: బాధితుడు తన భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల ప్రవర్తనను కప్పిపుచ్చడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాడో, తనను తాను ఎంతగా నిర్లక్ష్యం చేసుకుంటున్నాడో అంచనా వేయాలి. భావోద్వేగ మేధస్సు పెంచడం: తమ ప్రవర్తన ‘పరిపూర్ణమైన ప్రేమ’ కాదని, అది ఒక రకమైన ‘సహ-ఆధారపడటం’ అని క్లయింట్‌కి స్పష్టంగా, సానుభూతితో అర్థమయ్యేలా చెప్పాలి. హద్దుల ప్రాముఖ్యత: ఆరోగ్యకరమైన సంబంధాలలో వ్యక్తిగత సరిహద్దులు ఎంత అవసరమో మానసిక విశ్లేషణ ద్వారా వివరించాలి. ఎదుటివారి ఆమోదంపై ఆధారపడకుండా, తమ సొంత సామర్థ్యాలు, విలువలను గుర్తించేలా చేయడం కౌన్సెలర్‌ లక్ష్యం కావాలి. క్లయింట్‌కి కౌన్సెలర్‌ ఎప్పుడూ రక్షకుడిగా మారకూడదు. నిర్ణయాలు క్లయింటే తీసుకునేలా ప్రోత్సహించాలి. ఏండ్ల తరబడి ఉన్న ప్రవర్తనా విధానం ఒక్కసారిగా మారదు, కాబట్టి చిన్నచిన్న మార్పులను కూడా గుర్తించి ప్రోత్సహించాలి. ఏ బంధమైనా బలంగా

Original source: ntnews.com
Read more on Kaizer News