Kaizer News

రేషన్ పంపిణీలో అవకతవకలకు చెక్

రేషన్ పంపిణీలో అవకతవకలకు చెక్

· State - Telangana · prabhanews.com

కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి ఖానాపూర్ మండలంలో 17,347 రేషన్ కార్డులు ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు చేపడుతోంది. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. వేలిముద్రల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను పక్కాగా తెలుసుకునేందుకు తాజాగా ఈ-కేవైసీ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ మేరకు రేషన్ డీలర్లకు జిల్లా సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబంలోని సభ్యులు ఇప్పటివరకు రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్రలు నమోదు చేయించుకోని వారు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31లోపు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైందని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-కేవైసీ విధానంతో అర్హులైన లబ్ధిదారులను పక్కాగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు మృతి చెందినప్పటికీ వారి పేర్లపై బియ్యం పంపిణీ అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం కుటుంబంలో ఎవరో ఒకరు రేషన్ దుకాణానికి వచ్చి వేలిముద్ర వేస్తే సదరు రేషన్ డీలర్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరణించిన వారి పేర్లపై కూడా బియ్యం పంపిణీ జరుగుతున్న సందర్భాలను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ-కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను ఈ విధానం ద్వారా ధ్రువీకరిస్తున్నారు. రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ రేషన్ దుకాణాలకు వెళ్లి తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల వ్యాప్తంగా 35 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని 25 గ్రామపంచాయతీల పరిధిలో ఈ దుకాణాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 17,347 రేషన్ కార్డులు ఉండగా, ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు 35 కిలోలు, తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ప్రతి నెల ప్రభుత్వం బియ్యం అందజేస్తోంది. లబ్ధిదారుల వివరాలను పక్కాగా ధ్రువీకరించడం ద్వారా రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల పరిధిలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నెల 31లోపు అర్హులందరూ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని డీలర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు అర్హులైన పలువురు లబ్ధిదారుల నుంచి ఈ-పాస్ యంత్రాల ద్వారా వేలిముద్రలను సేకరించినట్లు డీలర్లు తెలిపారు. శనివారం మండలంలోని పాత తర్లపాడు గ్రామంలో రేషన్ డీలర్ పల్లెర్ల శ్రీనివాస్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ నమోదు చేశారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు డీలర్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పడిగెల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బోదాసు సాయి

Original source: prabhanews.com
Read more on Kaizer News