Shorts Gokavaram: గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరప్రవృత్తి కలిగిన రౌడీలను, సస్పెక్ట్ షీట్ దారులను సత్ప్రవర్తన నిమిత్తం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (MRO) కోర్టు నందు బైండ్ ఓవర్ చేసే క్రమంలో గోకవరం గ్రామానికి చెందిన సస్పెక్ట్ షీట్ దారుడు పోసిన వీర భార్గవ్ @ భార్గవ్ ను ఈనెల 1వ తేదీన MRO వారి వద్ద MC నెం. 58/2026లో బౌండ్ ఓవర్ చేయగా, ది.వి. 6-9-2026 తేదీన ఆర్&ఆర్ కాలనీలో జరిగిన కొట్లాటకు సంబంధించి స్టేషన్ క్రైమ్ నెం. 234/2026 కేసులో సదరు పోసిన వీర భార్గవ్ @ భార్గవ్ ప్రమేయం ఉందని తేలడంతో బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు వీర భార్గవ్ పై చర్యలకు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి ఎస్సై సిఫార్సు చేయగా, శుక్రవారం MRO కోర్టు సదరు వీర భార్గవ్ కు రూ. లక్ష జరిమానా లేదా జైలు విధించగా, అతడు రూ. లక్ష జరిమానా కట్టినట్లు గోకవరం ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ రౌడీ, సస్పెక్ట్ షీట్ దారుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, వారు నేరాలకు, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అదే విధంగా బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు