Kaizer News

ప్రభుత్వ సాయం పొందితే శాశ్వత నివాసం దూరం!

ప్రభుత్వ సాయం పొందితే శాశ్వత నివాసం దూరం!

· National - India · ntnews.com

ఈ కారణాలతో గ్రీన్‌ కార్డ్‌ అప్లికేషన్‌ తిరస్కరించవచ్చు ట్రంప్‌ సర్కార్‌ కొత్త పబ్లిక్‌ చార్జ్‌ నిబంధన అమల్లోకి వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 19: అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు వైద్య సహాయం, ఫుడ్‌ స్టాంప్‌లు, ట్యూషన్‌ సహాయం, పాఠశాల ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగించుకుంటే వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. ట్రంప్‌ ప్రభుత్వం విస్తరించిన పబ్లిక్‌ చార్జ్‌ నిబంధన శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అంచనాల ప్రకారం ఇది సుమారు 9.50 లక్షల మంది దేశం విడిచి వెళ్లేలా లేదా ఫెడరల్‌ భద్రతా పథకాలను తప్పించుకునేలా ప్రోత్సహించడం ద్వారా సంవత్సరానికి ఫెడరల్‌, రాష్ట్ర చెల్లింపులను1.1300 కోట్ల డాలర్ల మేర తగ్గించగలదు. ఈ నిబంధన అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు స్వయం సమృద్ధిగా ఉండాలి, పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడకూడదు అనే కాంగ్రెస్‌ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తున్నదని డీహెచ్‌ఎస్‌ విధాన పత్రం పేర్కొన్నది. కొత్త నిబంధనపై పిటిషన్‌ ట్రంప్‌ ప్రభుత్వం అమలు చేసిన కొత్త నిబంధనను వ్యతిరేకిస్తూ న్యూయార్క్‌తోపాటు మరో 21 రాష్ర్టాలు ఒక పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ నిబంధన సృష్టించే అనేక ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రంప్‌ ప్రభుత్వం విఫలమైందని పిటిషన్‌లో పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News