Kaizer News

123వ వారానికి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

123వ వారానికి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

· State - Telangana · prabhanews.com

భక్తిశ్రద్ధలతో పారాయణం.. రాఖీ పౌర్ణమి వేడుకల్లో భక్తుల సందడి భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: పట్టణంలోని నంది గల్లీలో నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం 123వ వారానికి చేరింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో నంది గల్లి ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ప్రతి వారం క్రమం తప్పకుండా పారాయణం నిర్వహించడం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందడంతో పాటు ఐక్యత, సోదరభావం మరింత బలపడుతోందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులంతా కలిసి రాఖీ పౌర్ణమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 123 వారాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సామూహిక పారాయణ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News