Kaizer News

వంద రోజుల హామీలు ఏమైనయ్‌?.. సర్కార్‌పై మాజీ ఎంపీ వ

వంద రోజుల హామీలు ఏమైనయ్‌?.. సర్కార్‌పై మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఫైర్‌

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చిన 420కి పైగా హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ దారుణంగా మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సమస్యలు పరిషరిస్తామని చెప్పిన ప్రభుత్వం, 1000 రోజులు గడుస్తు న్నా కార్మికుల గోడు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్‌టీయూ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వినోద్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్మికవర్గానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ దిశానిర్దేశం చేశారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్మికులంతా సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ వైఖరిని ప్రజలముందు ఎండగట్టాల్సిన బాధ్యత ఉన్నదని ఆయన పేరొన్నారు. కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టేందుకు సెప్టెంబర్‌ 2 నుంచి 10వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా విసృ్తత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి జిల్లాలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, ఆటో కార్మికుల ప్రత్యేక సదస్సులు నిర్వహించడం వంటివి చేపట్టాలని బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు నారాయణ, వేముల మారయ్య, హమాలీ శ్రీను, దాన కర్ణచారీ, సిలివేరు ప్రభాకర్‌, కిష్ణయ్య, మహేశ్‌ దేశపాక్‌, ప్రభాకర్‌, సంతోష్‌, మంజుల, స్వాతి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎండీవై పాషా తదితరులు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News