Hanumakonda: ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో దండేపల్లి గ్రామ ప్రగతి నివేదిక ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దండేపల్లి గ్రామంలో సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని అధికారులు వివరించారు. - 31 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అధిక శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. - 475 మందికి పెన్షన్లు అందుతుండగా, రూ.1.14 కోట్ల మేర నిధులు విడుదలవుతున్నాయి. - గృహ జ్యోతి పథకం ద్వారా 693 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.59.83 లక్షల లబ్ధి చేకూరింది. - మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 529 కుటుంబాలకు రూ.10.08 లక్షలు విడుదలయ్యాయి. - 64 మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.29.88 లక్షలు, బ్యాంకు లింకేజీ కింద రూ.8.60 కోట్లు విడుదలయ్యాయి. - ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి 900 కిట్ల చొప్పున 13 రకాల వస్తువులు అందించారు. - 332 మంది రైతులకు రూ.2.88 కోట్లు రైతు రుణమాఫీ కింద లబ్ధి చేకూరింది. - 1,033 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.5.28 కోట్లు అందాయి. - రైతు బీమా కింద 7 మంది రైతుల కుటుంబాలకు రూ.35 లక్షల విలువైన చెక్కులు అందించారు. - 428 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.81.07 లక్షలు విడుదలయ్యాయి. - 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఒకరికి షాదీ ముబారక్ చెక్కులు అందించారు. - గ్రామంలో 3,238 యూనిట్లకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. - భూభారతి కింద నమోదైన 9 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ సర్పంచ్ గులిపల్లి సంపత్ గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్, అంగన్వాడీ భవనం వంటి అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, ఇప్పటివరకు రూ.58 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలం సిద్ధంగా ఉందని సర్పంచ్ కోరగా, అదే స్థలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆరు నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివో భవన నిర్మాణానికి రెండు గుంటల స్థలాన్ని దానం చేసిన శంకర్ నారాయణను మంత్రి అభినందించారు. ఇప్పటికే ఒక వీఓ భవనం మంజూరు కాగా, దానం చేసిన