వరంగల్‌లోని సుప్రసిద్ధ ఎంజీఎం (MGM) ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులపై ఉన్నట్టుండి పైకప్పు (సీలింగ్) పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ హఠాత్ పరిణామంతో వార్డులోని రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గాయపడ్డారు. బాధితులకు స్వల్ప గాయాలు.. వేరే వార్డుకు తరలింపు పక్షవాతం సమస్యతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ వార్డులో చేరి చికిత్స పొందుతున్న రోగులతో పాటు, అక్కడ ఉన్న వారి సహాయకులు ఈ […]