Kaizer News

Renigunta: రేణిగుంటలో రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర

Renigunta: రేణిగుంటలో రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ !

· State - Telangana · hmtvlive.com

Renigunta: రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్ ఐ శ్రీనివాసులు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ హెచ్చరించారు. రేణిగుంట పట్టణంలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News