Kaizer News

Santhanuthalapadu: రెడ్ల బజార్‌లో ఘనంగా వినాయక నవర

Santhanuthalapadu: రెడ్ల బజార్‌లో ఘనంగా వినాయక నవరాత్రి వేడుకలు

· State - Telangana · hmtvlive.com

Shorts సంతనూతలపాడు: సంతనూతలపాడు కేంద్రంలోని రెడ్ల బజార్ నందు ఘనంగా వినాయకుని నవరాత్రి వేడుకలు జరుగుచున్నవి. ఆదివారం రాత్రి ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విద్యా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు విద్యలో ఉన్నతంగా రాణించాలని, భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ఆకర్షణీయమైన ముగ్గులను వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ముగ్గుల పోటీలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పోటీల్లో పాల్గొన్న మహిళలను నిర్వాహకులు అభినందించారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, మహిళలు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News