Kaizer News

హెట్‌మైర్‌ శతకం వృధా

హెట్‌మైర్‌ శతకం వృధా

· Sports · sakshi.com

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 తుది అంకానికి చేరింది. ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌, జమైకా కింగ్స్‌మన్‌ జట్లు సెప్టెంబర్‌ 20న టైటిల్‌ కోసం​ పోరాడతాయి. ఇవాళ జరిగిన క్వాలిఫయర్‌-2లో గయానా అమెజాన్‌ వారియర్స్‌పై గెలిచి జమైకా కింగ్స్‌మన్‌ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో వారియర్స్‌ భారీ స్కోర్‌ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో వారియర్స్‌ తరఫున షిమ్రోన్‌ హెట్‌మైర్‌ అజేయ మెరుపు శతకం (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 నాటౌట్‌) వృధా అయ్యింది. కింగ్స్‌మన్‌ను వారి కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (17 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌, హెట్‌మైర్‌ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతర​ం​ భారీ లక్ష్యాన్ని కింగ్స్‌మన్‌ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు తరఫున ప్రతి ఒక్కరు రాణించారు. కీసీ కార్తీ 56, మాజ్‌ సదాకత్‌ 41, కిర్క్‌ మెకెంజీ 34, సైమ్‌ అయూబ్‌ 23, రోవ్‌మన్‌ పావెల్‌ 40 పరుగులు చేశారు. సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) కాదని వెళ్ళావ్.. మేమంటే ఏంటో చూపిస్తాం..మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన బొత్స కొడుకు, కూతురు... హైదరాబాద్ లో దారుణం.. జుట్టు పట్టుకుని మహిళను ఈడ్చుకెళ్లిన రైల్వే పోలీస్ సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దెబ్బలకే మృతి.. సిట్ సంచలన రిపోర్ట్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ కు YS జగన్

Original source: sakshi.com
Read more on Kaizer News