Kaizer News

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా... 14 భవనాలు కూ

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా... 14 భవనాలు కూల్చివేత

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలోని మూడు జోన్లలో టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌, ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బృందాలు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 22 అనధికార నిర్మాణాలను గుర్తించి చర్యలు చేపట్టాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 14 నిర్మాణాలను అక్కడికక్కడే కూల్చివేయగా, మరో 2 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. మిగిలిన 6 భవనాలపై నిబంధనల ప్రకారం తదుపరి కూల్చివేతలకు అధికారులు సిద్ధమవుతున్నారు. నగరంలో అనధికార నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ను మరింత విస్తృతంగా చేపట్టాలని కమిషనర్‌‌‌‌ అధికారులను ఆదేశించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News