Kaizer News

Aloor: ఆలూరులో ఘనంగా గంగారెడ్డి 4వ వర్ధంతి వేడుకలు

Aloor: ఆలూరులో ఘనంగా గంగారెడ్డి 4వ వర్ధంతి వేడుకలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Aloor: ఆలూరు మండల్ ఆలూరు గ్రామంలో ఆలూర్ గంగారెడ్డి 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె విజయభారతి శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒంటెద్దుల శేఖర్ ను ఆమె స్వయంగా పరామర్శించారు. శేఖర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం,ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఏజిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ..క్యాన్సర్ వ్యాధిని చూసి అధైర్యపడకూడదని,సరైన వైద్యం, మానసిక ధైర్యంతో దీనిని జయించవచ్చని శేఖర్ కు ధైర్యం చెప్పారు. నేటి కాలంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎవరికైనా రావచ్చని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని అభయం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ముఖ్య నేతలు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News