జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లి గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న శ్రీ లక్ష్మీపార్వతి మహిళా సమాఖ్య భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల భద్రతకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఉప సర్పంచ్ తిరుపతిని ఎమ్మెల్యే పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచ్ గంగమల్లయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాల ముకుందం, ఎంఆర్ఓ హకీమ్, ఎస్సై ఉమాసాగర్, ఎంపీవో రవిబాబు, ఏఈ విజయ్ తదితరులు పాల్గొన్నారు