Kaizer News

కూలర్‌ను పక్కకు జరుపుతుండగా కరెంట్ షాక్.. యువకుడు

కూలర్‌ను పక్కకు జరుపుతుండగా కరెంట్ షాక్.. యువకుడు మృతి

· State - Telangana · ntnews.com

దస్తురాబాద్, ఆగస్టు 30: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఎంబాడి సతీష్‌ (27) ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై సాయి కుమార్‌ తెలిపారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న సతీష్‌ శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఇనుప ఎలక్ట్రిక్‌ కూలర్‌ను పక్కకు జరిపే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే దస్తురాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి భీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News