ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంకుల నిర్వహణకు సంబంధించి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం తెరపైకి వచ్చింది. బంకుల్లో యూపీఐ (AP Petrol Bunks UPI Ban) డిజిటల్ చెల్లింపుల విధానానికి స్వస్తి చెప్పి, కేవలం నగదు లావాదేవీలు మాత్రమే స్వీకరించాలని ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపుల సమయంలో సర్వర్ సమస్యలు, పేమెంట్ సెటిల్‌మెంట్‌లలో ఆలస్యం కారణంగా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు, బంకు సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. Harish Rao: దానం తీర్పు కాంగ్రెస్‌కు తీరని మచ్చ.. అందరూ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఈ డిజిటల్ లావాదేవీల వల్ల తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్యలను వివరించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలవనున్నారు. బంకుల్లో జరుగుతున్న గొడవలపై ప్రత్యేక వినతిపత్రం సమర్పించనున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా డీలర్లు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి కూడా అధికారికంగా లేఖ రాశారు. అసోసియేషన్ భావిస్తున్నట్లుగా యూపీఐ సేవలు పూర్తిగా నిలిచిపోతే మళ్లీ పాతకాలపు నగదు చెల్లింపుల విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే డిజిటల్ పేమెంట్లపైనే ఆధారపడే సాధారణ వాహనదారులు, ముఖ్యంగా అత్యవసర వేళల్లో పెట్రోల్ కొట్టించుకునే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. త్వరలోనే దీనిపై డీలర్ల సంఘం తుది ప్రకటన చేసే అవకాశం కనిపించడంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది