Kaizer News

Madanapalle: మదనపల్లెలో ఘనంగా రఘునాథ్ రెడ్డి ప్రథమ

Madanapalle: మదనపల్లెలో ఘనంగా రఘునాథ్ రెడ్డి ప్రథమ వర్ధంతి!

· State - Telangana · hmtvlive.com

Shorts Madanapalle: కీర్తిశేషులు శ్రీ రఘునాథ్ రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ధాత్రి ఆనంద నిలయంలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషుల కుమారులు బి. చక్రపాణి రెడ్డి, బి. అనిల్ కుమార్ రెడ్డి, కుమార్తె బి. హేమావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధాత్రి ఆనంద నిలయంలోని వృద్ధులకు అల్పాహారం అందించారు. కుటుంబ సభ్యులు స్వయంగా వృద్ధులకు టిఫిన్ వడ్డించి, కీర్తిశేషులు రఘునాథ్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బి. హేమావతి మాట్లాడుతూ... తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వృద్ధులకు అల్పాహారం అందించడం ద్వారా తండ్రి జ్ఞాపకాలను స్మరించుకున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆయన జ్ఞాపకార్థం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News