Kaizer News

Kuravi: గునిగంటి సాయిలు చిత్రపటానికి మాజీ మంత్రి ర

Kuravi: గునిగంటి సాయిలు చిత్రపటానికి మాజీ మంత్రి రెడ్యానాయక్ నివాళి!

· State - Telangana · hmtvlive.com

Shorts కురవి, సెప్టెంబర్ 19: కురవి మండలం మోదులగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గునిగంటి సాయిలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శనివారం ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్, సీనియర్ నాయకులు ఐలీ నరహరి, మాజీ సర్పంచ్ గండి వెంకటమల్లు, పెద్దబోయిన శ్రీశైలం యాదవ్, కందిపాటి వెంకన్న, యూత్ నాయకులు ఐలీ వీరేందర్ గౌడ్, వల్లపు యాకన్న, తీగల రఫీ, గునిగంటి వీరన్న తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News