Kaizer News

Hanamkonda: మహిళల కోసం ఏర్పడినదే పరకాల ఇందిరా డైరీ

Hanamkonda: మహిళల కోసం ఏర్పడినదే పరకాల ఇందిరా డైరీ: ఎమ్మెల్యే రేవూరి

· State - Telangana · hmtvlive.com

Shorts హన్మకొండ: భవానీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఇందిరా మహిళా డైరీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులు, డైరీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల కోసం మహిళలతోనే పరకాల ఇందిరా మహిళా డైరీ ఏర్పడిందని, పాల సేకరణ పెంపు, పాడి పశువుల నాణ్యత మెరుగు, మార్కెటింగ్ బలోపేతం, పశువుల దాణా-పచ్చిమేత, కృత్రిమ గర్భధారణ, మహిళా రైతులకు శిక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. పరకాల మహిళా డైరీ అభివృద్ధిలో భాగంగా జాతీయ పాలాభివృద్ధి మండలి (NDDB)తో ఐదేళ్ల భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. పాడి రైతులకు న్యాయమైన ధర అందించి, మధ్యవర్తులపై ఆధారపడకుండా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా అధికారుల సహకారంతో పరకాల డైరీని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News