Kaizer News

కార్పొ రేట్‌పై.. కన్నెర్ర

కార్పొ రేట్‌పై.. కన్నెర్ర

· State - Telangana · ntnews.com

పరిహారంలో వివక్షపై నాదర్‌గుల్‌ రైతుల ఫైర్‌ సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ఒక్కో రైతుకు ఒక్కో ధర ఇచ్చారని స్థానికుల ఆగ్రహం గతంలో ఎకరాకు ఐదారు లక్షలతోనే సరిపెట్టిన కంపెనీలు ఇటీవల కొందరికి రూ.30 లక్షలు ఇచ్చారని ప్రచారం తమకు తక్కువ ఇచ్చారంటూ ఇతర రైతుల్లో ఆందోళన అంతే రేటు తమకూ ఇవ్వాలంటూ బాధితుల డిమాండ్‌ భూములను వదిలేది లేదంటూ నిరసనలకు సిద్ధం నాదర్‌గుల్‌ భూములపై మళ్లీ కలకలం రేగుతున్నది. ఒకే సర్వేనంబర్‌ భూములకు చెల్లించిన నగదులో వ్యత్యాసంపై అన్నదాతలు రగులుతున్నారు. గతంలో ఎకరాకు ఐదారు లక్షలతోనే సరిపెట్టిన కంపెనీలు, ఇటీవల తోటి రైతుల నుంచి రూ.30 లక్షల చొప్పున కొనుగోలు చేయడంపై ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ‘నాదర్‌గుల్‌ భూములు.. బిగ్‌ హస్తగతం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన ప్రత్యేక కథనంతో అసలు విషయం బయటపడి కలకలం మొదలైంది. హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నాదర్‌గుల్‌ భూముల వ్యవహారంలో తెరవెనుక సర్కార్‌ పెద్దల అండ, రెవెన్యూ శాఖ ఉద్దేశపూర్వక మౌనముద్ర, ప్రైవేటు భూములు అంటూ హైడ్రా ధ్రువీకరణ.. ఇన్ని అనుకూలతలు ఉన్నా రికార్డుల తారుమారు ఎలా? అనే దానిపై కార్పొరేట్‌ కంపెనీ మల్లగుల్లాలు పడుతున్నది. మొదట్లో నంబర్‌-2 మంత్రి కనుసన్నల్లో నడిచిన వ్యవహారం ఇప్పుడు బిగ్‌బ్రదర్‌ చేతుల్లోకి పోవడంతో కొన్నిరోజులపాటు దూకుడు ప్రదర్శించింది. ఇందులో భాగంగానే కొందరు రైతులను నయానో భయానో దారిలోకి తెచ్చుకొని ఎకరాకు రూ.30 లక్షలు ముట్టజెప్పిన విషయం తెలిసిందే. గతంలో ఐదారు లక్షలతో సంతృప్తిపడిన రైతులంతా ‘ఒక్కో రైతుకు ఒక్కోరేటు ఇస్తరా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 613 (పాత 119)లో 373.22 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ క్షణానికీ రెవెన్యూ రికార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఒక ప్రైవేట్‌ కంపెనీ చేతిలో బందీకావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గజం ప్రభుత్వ భూమిని కూడా కబ్జా కానీయబోమంటూ హైడ్రా, ప్రభుత్వ పెద్దలు చేసే ప్రకటనలన్నీ ప్రజలను మభ్యపెట్టేందుకే అనడానికి ఈ భూముల బందీయే ప్రత్యక్ష ఉదాహరణ. సుప్రీంకోర్టులో ఇవి ప్రభుత్వ భూములేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం అవే భూములను తమ ఆధీనంలోకి మాత్రం తీసుకోవడం లేదు. పైగా వాటికి సంబంధించి సీలింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టామంటూ చేసే ప్రకటన మరో విడ్డూరం. ఇలా అనేక చిత్ర విచిత్రాలకు వేదికగా మారిన ఈ భూములు బిగ్‌బ్రదర్స్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత స్థానికంగా కొంత స్తబ్దత నెలకొన్నది. చాకచక్యంగా రైతుల మధ్య విభేదాలు సృష్టించి.. ఇన్నాళ్లూ డబ్బులు తీసుకోని రైతులను దారిలోకి తెచ్చుకున్నారు. ఎకరాకు రూ.30 లక్షలు ముట్టుజెప్పారు. ఈ సెటిల్‌మెంట్‌ జరిగి చాలా రోజులైనా గ్రామంలో పెద్దగా చర్చ జరుగలేదు. కానీ శనివారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం వచ్చిన తర్వాత మళ్లీ కలకలం మొదలైంది. గతంలో రూ.ఐదారు లక్షలతోనే అనధికారిక ఒప్పందాలపై సంతకాలు చేసిన రైతులు ఇప్పుడు భగ్గుమంటున్నా

Original source: ntnews.com
Read more on Kaizer News