Kaizer News

Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నో

Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు

· National - India · ntvtelugu.com

Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు కేజ్రీవాల్‌తో పాటు తల్లిదండ్రులకు, భార్య, కుమారుడికి గత జాబితా ప్రస్తుత ‘సర్’తో సరిపోలేదని నోటీసు Follow Us : --> Add as a preferred source on google ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఢిల్లీలో ఓటర్ జాబితాకు సంబంధించి ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్‌కు.. ఆయన కుటుంబ సభ్యులకు.. మొత్తం ఐదుగురికి ఎన్నికల సంఘం నోటీసు పంపింది. ప్రస్తుత సర్ ప్రక్రియలో ఓటర్ జాబితాతో మ్యాచ్ కాలేదని తెలుస్తోంది. దీంతో ఈసీ నోటీసు పంపించింది. నివేదికల ప్రకారం.. ఢిల్లీ ఎన్నికల అధికారులు అరవింద్ కేజ్రీవాల్, అతని భార్య సునీతా కేజ్రీవాల్, తండ్రి గోవింద్ రామ్ కేజ్రీవాల్, తల్లి గీతా దేవిలకు నోటీసులు జారీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ 25 ఏళ్ల కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్‌కు కూడా ఇదే కేటగిరీలో నోటీసు జారీ చేశారు. మరోసారి అధికారుల ముందు హాజరై ఓటు సరి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News