Kaizer News

‘వెలిగొండ’లో క్రెడిట్‌ చోరీ

‘వెలిగొండ’లో క్రెడిట్‌ చోరీ

· State - Telangana · sakshi.com

వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి, ప్రారంభించిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌) జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబర్‌ 27న వెలిగొండకు శంకుస్థాపన చేసిన నాటి సీఎం వైఎస్సార్‌ రూ.3,581.58 కోట్లు వ్యయం చేసి సింహభాగం పనులు పూర్తి చేయించిన మహానేత 2014–19 మధ్య వెలిగొండను తన దోపిడీకి ప్రయోగశాలగా మార్చుకున్న చంద్రబాబు ధరల సర్దుబాటు కింద రూ.630.57 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన వైనం టీబీఎంల మరమ్మతుల కోసం రూ.66.44 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి.. కమీషన్లు వసూలు చంద్రబాబు దోపిడీని బహిర్గతం చేసిన ‘కాగ్‌’ నివేదిక 2019–24 మధ్య కోవిడ్‌లోనూ వెలిగొండ పనులను పరుగులెత్తించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే దుర్బుద్ధితో నిర్వాసితులకు పునరావాసంలో తీవ్ర జాప్యం 2014–19 మధ్య ఫీడర్‌ కెనాల్‌లో 5.2 కి.మీ. పొడవున గట్ల పనులు అత్యంత నాసిరకంగా చేసిన చంద్రబాబు సర్కార్‌ 2024లో కురిసిన వర్షాలకు గట్లకు గండ్లు.. వాటి సాకుతో ఫీడర్‌ కెనాల్‌కు లైనింగ్, రిటైనింగ్‌ వాల్‌ పనులను రూ.456 కోట్లకు అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన బాబు సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి? చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి వేరే ఇంకేం సాక్షాలు కావాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా మరో క్రెడిట్‌ చోరీకి సిద్ధమయ్యారు! విశాఖలో డేటా సెంటర్‌.. భూముల సమగ్ర రీ సర్వే,.. గత ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రీతిలోనే ఆయన దృష్టి తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. ఈ నెల 31న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాలు (ట్విన్‌ టన్నెల్స్‌) ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేస్తున్నానని.. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్నానంటూ ‘ఎక్స్‌’ ద్వారా సీఎం చంద్రబాబు గొప్పగా అబద్ధాలు చెబుతుంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ హయాంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండలో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్‌ టన్నెల్స్‌)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద నిర్వాసితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వైఎస్‌

Original source: sakshi.com
Read more on Kaizer News