Shorts మహబూబ్‌నగర్ జిల్లా: దేవరకద్ర, కౌకుంట్ల మండలాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,వాకిటి శ్రీహరి,దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.అదేవిధంగా గుడిబండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ నరసింహులు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నేపథ్యంలో ముఖ్య నేతలు గ్రామానికి రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు,కార్యకర్తల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమరేశ్వర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గోపన్ పల్లి కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ కొమరి బాలరాజ్, రాంబాబు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు