Kaizer News

బొజ్జ గణపతికి 108 రకాల ప్రసాదాలు

బొజ్జ గణపతికి 108 రకాల ప్రసాదాలు

· State - Telangana · prabhanews.com

ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు ఆకట్టుకున్న భజన కార్యక్రమం గోదావరిఖని, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీలో గల సంజీవ ఆంజనేయస్వామి దేవాలయంలో బొజ్జ గణపతికి శనివారం రాత్రి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. శ్రీ గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా వందలాది మంది మహిళలు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గుండెబోయిన వెంకన్న, గడ్డం శ్యామ్‌కుమార్‌ గౌడ్‌, కోశాధికారి కొమ్ము కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రివేళ గణపతి మండపం వద్ద వందలాది మంది మహిళలు స్వామివారిని స్మరిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన భజన కార్యక్రమాల్లో మహిళలు ఆలపించిన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది

Original source: prabhanews.com
Read more on Kaizer News