Kaizer News

Amalapuram: గోడి గురుకులంలో మిగిలిన సీట్ల భర్తీకి

Amalapuram: గోడి గురుకులంలో మిగిలిన సీట్ల భర్తీకి తక్షణ ప్రవేశాలు!

· State - Telangana · hmtvlive.com

అమలాపురం: అల్లవరం మండలంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది,తొమ్మిది తరగతులతో పాటు జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపిసి,బైపిసి గ్రూపులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి తక్షణ ప్రవేశాలు జరుగుతున్నాయి. ఉచిత వసతి,నాణ్యమైన భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు,దుస్తులు,క్రీడా మైదానం,ప్రయోగశాలలు మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కార్పొరేట్ స్థాయి విద్యా సౌకర్యాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.ఈ ప్రభుత్వ గురుకులంలో చేరాలనుకునే విద్యార్థులు,ఆగస్టు 31 సోమవారం సాయంత్రం 4:00 గంటలలోపు అల్లవరంలోని బాలుర గురుకుల విద్యాసంస్థకు నేరుగా వచ్చి అడ్మిషన్లు పొందవచ్చును. ఇదే చివరి అవకాశమని, ఆసక్తి గల తల్లిదండ్రులు తమ తమ పిల్లల మార్కుల జాబితా,ఆధార్ కార్డు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు.ఈ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఐదవ తరగతికి 9346835374 (చంద్రశేఖర్),ఆరవ తరగతికి 8331882301 (యోహాన్), ఏడవ తరగతికి 8985801662 (కిషోర్ కుమార్),ఎనిమిదవ తరగతికి 8309650364 (జగదీష్),తొమ్మిదవ తరగతికి 9704414240 (నాగేశ్వరరావు) మరియు జూనియర్ ఇంటర్మీడియట్ కోసం 9492663542 (బాలాజీ) నంబర్లలో సంప్రదించవచ్చును అని ప్రిన్సిపాల్ తెలియజేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News