Kaizer News

పుట్టినరోజు కానుకగా టైటిల్ గ్లింప్స్ విడుదల

పుట్టినరోజు కానుకగా టైటిల్ గ్లింప్స్ విడుదల

· Entertainment · prabhanews.com

కార్ల చేజింగ్‌లు, ఉత్కంఠ రేపిన నాగార్జున కొత్త అవతారం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టబుతో మళ్లీ జోడీ.. రా. కార్తీక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం హైదరాబాద్, ఆంధ్రప్రభ: అక్కినేని నాగార్జున సినీ ప్రయాణంలో అత్యంత ప్రత్యేకమైన మైలురాయి వచ్చేసింది. ఆయన నటిస్తున్న 100వ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. నాగ్‌కు ఉన్న ‘కింగ్’ ఇమేజ్‌కు తగ్గట్టుగానే రూపొందిన ఈ గ్లింప్స్‌లో స్టైల్, యాక్షన్, ఉత్కంఠను కలిపి చూపించారు. టైటిల్ గ్లింప్స్ విడుదలైన వెంటనే అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది. నాగార్జున కెరీర్‌లో ఇది కేవలం మరో సినిమా కాదు. దశాబ్దాల సినీ ప్రయాణానికి గుర్తుగా నిలిచే 100వ చిత్రం కావడంతో దీనిపై ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున–దేవిశ్రీప్రసాద్ కలయిక గతంలో సంగీతపరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని పాటలు, నేపథ్య సంగీతంపైనా ఆసక్తి పెరిగింది. విడుదలైన గ్లింప్స్‌లో నాగార్జునను అత్యంత స్టైలిష్‌గా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. వేగంగా సాగే దృశ్యాలు, కార్ల చేజింగ్‌లు, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందో సినిమా కోసం నాగ్ సాధారణ కథను కాకుండా, తన స్టార్ ఇమేజ్‌తో పాటు కొత్తదనాన్ని కలిపిన కథను ఎంచుకున్నారనే అభిప్రాయం గ్లింప్స్‌ను చూసిన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ సినిమా మరో ప్రధాన ఆకర్షణ నాగార్జున–టబు కలయిక. ‘నిన్నే పెళ్లాడతా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకే చిత్రంలో కనిపించనుంది. టబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. ఆమె పాత్ర స్వరూపంపై మాత్రం చిత్రబృందం పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఇతర నటీనటులు, పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా దశలవారీగా వెల్లడయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న అన్ని పేర్లు, పాత్రలపై చిత్రబృందం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆగస్టు 29న నాగార్జున తన 67వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా ‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాగార్జునకు ఇది వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ అత్యంత కీలకమైన సందర్భం. ‘విక్రమ్’తో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రేమకథలు, కుటుంబ కథలు, యాక్షన్ చిత్రాలు, ప్రయోగాత్మక పాత్రలు, భక్తిరస చిత్రాలు అంటూ విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ‘గీతాంజలి’, ‘శివ’, ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి చిత్రాలతో నాగార్జున స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. మరోవైపు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడీ సాయి’ వంటి భక్తిరస పాత్రల్లోనూ ప్రశంసలు అందుకున్నారు. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా విభిన్న

Original source: prabhanews.com
Read more on Kaizer News