Shorts విశాఖపట్నం: యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమలకు రాయితీలు, సింగిల్ విండో విధానంలో అనుమతులు అందిస్తూ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్ధి చెంది యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విశాఖలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనూ పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాలాక్షినగర్‌లో సీఎన్‌ఆర్ వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎన్‌ఆర్ వెంచర్స్ అధినేతలు చెల్లుబోయిన రాము, చెల్లుబోయిన నర్సింగరావు (చంటిలు) ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీరియల్ నటుడు బాలును ఘనంగా సత్కరించారు. తెలుగు ప్రజల అభిమానంతోనే సీరియల్స్‌లో మంచి గుర్తింపు పొందానని ప్రముఖ బుల్లితెర నటుడు బాలు తెలిపారు. భవిష్యత్తులో సినిమాల్లోనూ నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సీఎన్‌ఆర్ వెంచర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ వ్యాపార కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కోట్ల రఘు, అయ్యప్ప రెడ్డి, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, నటుడు బాలు కలిసి ఫొటోలు దిగేందుకు స్థానిక మహిళా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’