Kaizer News

ప్రమోషన్ పొందిన ఐపీఎస్ అధికారికి కానిస్టేబుల్ అభిన

ప్రమోషన్ పొందిన ఐపీఎస్ అధికారికి కానిస్టేబుల్ అభినందనలు

· State - Telangana · prabhanews.com

కమలాపూర్, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల కరుణాకర్ ఇటీవల ఐపీఎస్ పదోన్నతి పొందిన సందర్భంగా ఆయన అభిమాని, కానిస్టేబుల్ అలీ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కమలాపూర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన అలీ, అదే మండలానికి చెందిన పోలీస్ అధికారి పుల్ల కరుణాకర్ ఐపీఎస్ పదోన్నతి పొందడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ఉప్పల్ గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన పుల్ల కరుణాకర్ అంచెలంచెలుగా ఎదిగి పోలీస్ శాఖలో అనేక పదవులు నిర్వహించి ఐపీఎస్ స్థాయికి చేరుకోవడం ఎంతో మందికి ఆదర్శమని అలీ అన్నారు. ఆయన సాధించిన ఈ ఘనత ఉప్పల్ గ్రామానికే కాకుండా కమలాపూర్ మండలానికి కూడా గర్వకారణమని అభివర్ణించారు. కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరిన కరుణాకర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News