Kaizer News

కిష్టాపూర్ విద్యార్థినికి రూ.2 లక్షల నగదు పురస్కార

కిష్టాపూర్ విద్యార్థినికి రూ.2 లక్షల నగదు పురస్కారం

· State - Telangana · prabhanews.com

ఈ నెల 24న గవర్నర్ చేతుల మీదుగా అందుకోనున్న శ్వేత జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం మండలం కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన లసెట్టి శ్వేతకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.2 లక్షల నగదు పురస్కారం లభించింది. సంస్థ నిర్వహించిన ‘చదువుకో తెలంగాణ బహుమానం’ కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాన్ని ఈ నెల 24న హైదరాబాద్‌లోని సెంచరీ కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా శ్వేత అందుకోనున్నారు. నగదు పురస్కారంతోపాటు సర్టిఫికెట్‌ను కూడా అందజేయనున్నట్లు పాఠశాల హెచ్‌ఎం గుండ రాజన్న ఆదివారం సాయంత్రం తెలిపారు. గత ఏడాది జరిగిన ఎస్సెస్సీ పరీక్షల్లో శ్వేత 582 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ ర్యాంకు పొందినట్లు హెచ్‌ఎం తెలిపారు. విద్యార్థినికి అరుదైన అవకాశం దక్కడంపై జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య, మండల విద్యాధికారి బి. రాజేందర్, గ్రామ సర్పంచి వాసాల నరేష్, పాఠశాల ఏఏపీసీ చైర్మన్ మంగ, ఉపాధ్యాయులు జాడి మురళి, దాముక కమలాకర్, గోవర్ధన చారి, కొట్టే రాజన్న, ప్రకాష్ బానావత్, నరహరి శర్మ తదితరులు అభినందించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News